ETV Bharat / city

'లాక్​డౌన్​ ఉల్లంఘనలపై వారికి ఫిర్యాదు చెయ్యండి'

ప్రజాప్రతినిధులు లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ జరిపింది. లాక్​డౌన్​ ఉల్లంఘనలపై విపత్తు నిర్వహణ చట్టం కింద సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. లాక్​డౌన్​ ఉల్లంఘించారని వైకాపా ఎమ్మెల్యేలు, తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్​లపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు
author img

By

Published : May 29, 2020, 7:21 AM IST

ప్రజాప్రతినిధుల లాక్​డౌన్ ఉల్లంఘనలపై విపత్తు నిర్వహణ చట్టం కింద సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ బి. కృష్ణమోహన్​తో కూడిన ధర్మాసనం వ్యాజ్యాలపై ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా , సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, చిలకలూరి పేట ఎమ్మెల్యే రజని లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది పారా కిశోర్ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లాక్​డౌన్ ఉల్లంఘించారని న్యాయవాది వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు.

ఈ వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది . ఎమ్మెల్యే వెంకటగౌడ్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ లాక్​డౌన్ ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయడానికి ప్రత్యామ్నాయంగా మరో వేదిక ఉందని కోర్టుకు తెలిపారు. హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. వైకాపా ఎమ్మెల్యేలు ఉల్లంఘనలకు పాల్పడలేదని, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారని కోర్టుకు స్పష్టం చేశారు.

ప్రతి అంశానికి పిల్ దాఖలు చేసి ప్రభుత్వాన్ని ముందు కెళ్లకుండా అడ్డుకుంటున్నారని న్యాయవాది సుమన్ అన్నారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంపై 60 వ్యాఖ్యలు దాఖలు అయ్యాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

ఇదీ చదవండి : విశాఖ జిల్లాలో మిడతల దండు అలజడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.