ETV Bharat / city

బీఏఎస్ పథకం నిలిపివేత ఆదేశాలపై హైకోర్టు స్టేటస్ కో - ఏపీ హైకోర్టు వార్తలు

బీఏఎస్ పథకాన్ని నిలిపివేస్తూ సాంఘిక, సంక్షేమశాఖ ప్రొసీడింగ్స్​పై హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు....ఆదేశాలపై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Ap high court
Ap high court
author img

By

Published : Nov 19, 2020, 5:54 PM IST

Updated : Nov 19, 2020, 7:07 PM IST

బీఏఎస్(బెస్ట్ ఎవైలబుల్ స్కూల్) పథకాన్ని నిలిపివేస్తూ సాంఘిక, సంక్షేమశాఖ డైరెక్టర్ ప్రొసీడింగ్స్​ను తాడి భీమరావు అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్​పై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం డైరెక్టర్ ఆదేశాలపై యథాతథస్థితి విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో విద్య అందించేందుకు 1995లో..అప్పటి ప్రభుత్వం జీవో నెంబరు 95ను జారీ చేసింది.

ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారని పిటీషనర్ తరపు న్యాయవాది శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. తాజాగా సాంఘిక, సంక్షేణశాఖ డైరెక్టర్ బీఏఎస్ పథకాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జీవో 95 ద్వారా అమలు చేసే పథకాన్ని నిలిపి వేయటం సరికాదని పిటీషనర్ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఆ పథకాన్ని నిలిపివేస్తే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈ విషయంపై నూతన జీవో విడుదల చేస్తామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సాంఘిక, సంక్షేమశాఖ ఇచ్చిన ఆదేశాలపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చదవండి : స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం జగన్ చర్చ!

Last Updated : Nov 19, 2020, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.