ETV Bharat / city

అలాంటి స్వేచ్ఛ పోలీసులకు లేదు: హైకోర్టు - ap high court latest news

ఓ పిటిషనర్ తరపు న్యాయవాది ఇంటికి తెల్లవారుజామున పోలీసులు ఎందుకెళ్లాల్సి వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటి స్వేచ్ఛ పోలీసులకు లేదని స్పష్టం చేసింది. చిరునామా తప్పని తెలసుకున్నప్పుడు తిరిగి వెళ్లాలి కానీ.. గంటన్నర అక్కడే ఎందుకు ఉన్నారని నిలదీసింది. వ్యక్తుల ఆక్రమ నిర్బంధాల వ్యవహారంలో దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

AP High Court Serious Comments on Police
అలాంటి స్వేచ్ఛ పోలీసులకు లేదు: హైకోర్టు
author img

By

Published : Nov 6, 2020, 4:59 AM IST

పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురి వ్యక్తుల్ని వేర్వేరు సందర్భాల్లో అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న ఘటనల్లో వారిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ.. దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది. రాష్ట్రంలో రాజ్యాంగ బ్రేక్​డౌన్ జరిగిందా..? లేదా..? అన్నది తేలుస్తామని గత విచారణలో కోర్టు హెచ్చరించిన విషయం తెలిసిందే. తన కుమారుడు రెడ్డి గౌతమ్, కోడలు ఎల్లంటి లోచినిను విజయవాడలో గతేడాది అక్టోబర్ 28న విశాఖ 4వ పట్టణ పోలీసులు అక్రమంగా ఆరెస్టు చేశారని రెడ్డి గోవిందరావు వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ ఎస్. ఎస్. ప్రసాద్ వాదనలు వినిపించారు. అక్రమ నిర్బంధానికి గురయ్యామని చెబుతున్నవారు.. పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వారికి విశాఖపట్నం కోర్టు రిమాండ్ విధించిందన్నారు. ఒకవేళ అక్రమ నిర్బంధం జరిగినా.. వారు సివిల్ కోర్టును ఆశ్రయించి పరిహారం పొందాలి తప్పా... హైకోర్టులో ఉపశమనం పొందలేరని పేర్కొన్నారు. చిరునామాలో పొరపాటుపడి విజయవాడలోని న్యాయవాది ఇంటికి పోలీసులు వచ్చారని వివరణ ఇచ్చారు. వాదనల కొనసాగింపునకు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

ఇదీ చదవండీ... కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.