రాష్ట్రంలో 378 డీఈడీ కళాశాలల అనుమతులను రద్దు చేస్తూ.. ఇచ్చిన ఎన్‌సీటీఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో రాష్ట్ర విద్యాశాఖ సిఫార్సు మేరకు ఎన్‌సీటీఈ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే... ఎన్‌సీటీఈ ఉత్తర్వులపై హైకోర్టులో 47 కళాశాలలు రిట్ పిటిషన్ వేశాయి. పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం.. ఇవాళ విచారణ జరిపింది.
పిటిషనర్ తరపున శ్రీ విజయ్ వాదనలు వినిపించారు. చట్టంలోని సెక్షన్ 17ను ఎన్‌సీటీఈ అనుసరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. కళాశాలల అనుమతి రద్దుచేస్తూ ఎన్‌సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Garbage in a Store: కర్నూలులో మున్సిపల్ అధికారుల నిర్వాకం.. చెత్త పన్ను కట్టలేదని..!