ETV Bharat / state

'సౌదీలో ఇబ్బందులు పడుతున్నా-రక్షించండి' - మంత్రి లోకేశ్​కు మహిళ విజ్ఞప్తి - KADAPA WOMEN PROBLEMS IN GULF

తిరిగి రావాలంటే డబ్బులు కట్టాల్సిందే - ఎంబసీ చుట్టూ తిరుగుతున్నా జరగని న్యాయం

kadapa_women_problems_in_gulf_emotional_video
kadapa_women_problems_in_gulf_emotional_video (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2024, 2:05 PM IST

Updated : Nov 18, 2024, 2:14 PM IST

Kadapa Women Problems In Gulf Emotional Video : ఏజెంట్ల వల్ల ఎంతో మంది మహిళలు గల్ఫ్ దేశాలలో నానా అగచాట్లు పడుతున్నారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇంకా ఏజెంట్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కడపకు చెందిన ఓ మహిళ ఎనిమిది నెలల కిందట సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ మహిళ పెట్టే వేధింపులు భరించలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వీడియోను బాధితురాలు కడపకు పంపించారు. తనను కడపకు పంపించాలని మంత్రి లోకేశ్​ను ఆమె వేడుకున్నారు.

Women Trapped in Saudi Seeking For Help : సౌదీ అరేబియాలో ఉండే ఇండియా ఎంబసీ అధికారులు సైతం పట్టించుకోవడం లేదని బంగ్లాదేశ్​కు సంబంధించిన వారి గదిలో ఉంటూ తలదాచుకుంటున్నానని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు కడప రవీంద్ర నగర్​కు చెందిన షకీలా. ఆమెకు భర్త, నలుగురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో ఇద్దరు ఆడపిల్లలకు వివాహాలు చేశారు. ఈ క్రమంలో అప్పులు కావడంతో వాటిని తీర్చుకునేందుకు ఎనిమిది నెలల కిందట కడపకు చెందిన ఏజెంట్ సహాయంతో సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఓ మహిళ వద్ద షకీలా భానును పనికి పెట్టారు ఏజెంట్​. కానీ ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో షకీలాను కొట్టడం కొరకడం చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తుందని బాధితురాలు వాపోయింది.

రాష్ట్రానికి రాలేననుకున్నా- లోకేశ్ సాయంతో ప్రాణాలతో తిరిగొచ్చా: గల్ఫ్ బాధితుడు వీరేంద్ర - Lokesh saved Virendra Kumar

ఆ వేధింపులు తట్టుకోలేక షకీలా అక్కడున్న ఇండియా ఎంబసీకి గత రెండు నెలల నుంచి తిరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. షకీలా తిరిగి కడపకు రావాలంటే ఐదు లక్షలు చెల్లించాలని ఏజెంట్​ డిమాండ్ చేస్తోందని బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. కొన్ని సందర్భాల్లో మూడు నాలుగు రోజులు పాటు భోజనం కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను భర్త, పిల్లల వద్దకు తల్లిదండ్రుల వద్దకు పంపించాలని వేడుకుంటుంది. ఇండియా వారి నన్ను కాపాడాలని కోరుతోంది.

ఏడాదిన్నర క్రితం ఎడారి దేశానికి-నేడు మృత దేహంగా స్వగ్రామానికి

Last Updated : Nov 18, 2024, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.