ETV Bharat / state

పలకరించేందుకు వచ్చిన బావమరిదిని చంపిన బావ - ఆపై ఏం జరిగిందంటే ! - MAN KILLED BROTHER IN LAW

పరామర్శించడానికి వచ్చిన బావమరిదిని గొడ్డలితో దాడి చేసి చంపిన బావ - ప్రతీకారంగా బావపై దాడి చేసి చంపిన కుటుంబీకులు

A Man Killed his Own Brother-in-Law in Rangareddy District
A Man Killed his Own Brother-in-Law in Rangareddy District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2024, 1:58 PM IST

A Man Killed his Own Brother-in-Law in Rangareddy District : పరామర్శించేందుకు వచ్చిన సొంత బామ్మర్దినే బావ హ్యత చేసిన ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. అనంతరం విషయం తెలుసుకున్న బాధితుని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ప్రతీకారంగా బావను అంతమొందించారు. దీంతో ఒకే రోజే రెండు హత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నాగిళ్ల గ్రామంలో చోటు చేసుకుంది.

బామ్మర్దిపై గొడ్డలితో దాడి : స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి గతేడాది విడుదలయ్యాడు. తాజాగా ఆదివారం నాగిళ్లలో ఓ వివాహం జరగగా, ఆ వివాహ వేడుకలో పాల్గొనేందుకు యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన గడ్డం శ్రీను (యాదయ్య భార్య తమ్ముడు) వచ్చారు. అనంతరం అదే గ్రామంలో ఉన్న తన బావ (యాదయ్య)ను పరామర్శించేందుకు అతని ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో యాదయ్య శ్రీనుపై గొడ్డలితో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆరేళ్లు సహజీవనం - పత్తి చేనులో ఆరడుగుల గొయ్యి బహుమతి

రాత్రి అయ్యేవరకు మృతదేహాలు అక్కడే : ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు, బంధువులు నాగిళ్లకు చేరుకుని యాదయ్యపై దాడి చేశారు. ఈ దాడిలో యాదయ్య కూడా మృతి చెందాడు. ఆదివారం రాత్రి అయ్యేవరకు ఇద్దరి మృతదేహాలను అక్కడే ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణాలతో ఉందో? లేదో? తెలియకుండానే అత్యాచారం - ఆపై కాల్వలో పడేసిన యువకులు

ముగ్గురి దారుణ హత్య - భయంతో తలుపులు పెట్టుకున్న గ్రామస్థులు - పోలీసులు వెళ్లేవరకూ ఇళ్లలోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.