ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ (ఏపీసీఎల్) సంయుక్త కార్యదర్శి బి. మోహనరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. నాలుగు నెలలలోపు మానవహక్కుల కమిషన్ ఏర్పాటుచేయాలని అడ్వకేట్ జనరల్‌కు హైకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ప్రస్తుతం 8 వేలకుపైగా కేసులు మానవహక్కుల కమిషన్‌లో పెండింగ్ ఉన్నాయని పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2016లో జస్టిస్ ఏ.కక్రూ పదవీవిరమణ చేసిన తర్వాత ఛైర్మన్‌గా ఎవరిని నియమించలేదన్నారు. మానవహక్కులను కాపాడటంలో కమిషన్ ఛైర్మన్, సభ్యుల పాత్ర క్రియాశీలకంగా ఉంటుందని పిటీషనర్ అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ కమిషన్ ఏర్పాటు చేసేందుకు కొంత సమయం కావాలని కోరారు. కమిషన్‌లో ఖాళీలు భర్తీ చేయటం, నూతన కార్యాలయం, ఫర్నీచర్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నాలుగు నెలలలోపు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని తెలిపింది.
ఇదీ చదవండి :