ETV Bharat / city

10 రోజుల వైకుంఠ ద్వార దర్శనంపై దాఖలైన వ్యాజ్యం కొట్టివేత - వైకుంఠ ద్వార దర్శనంపై పిల్​ను కొట్టేసిన హైకోర్టు న్యూస్

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఉత్తరద్వార దర్శనాన్ని పది రోజులు కల్పించేందుకు తితిదే తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. తితిదే నిర్ణయం వల్ల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినట్లు రుజువు చేసే ఆధారాల్ని పిటిషనర్‌ చూపలేదని పేర్కొంది.

ap high court on tirumala vaikunta darshanam

author img

By

Published : Jan 2, 2021, 6:45 AM IST

తిరుమలలో 10 రోజుల వైకుంఠ ద్వారా దర్శనంపై దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. మత విశ్వాసానికి సంబంధించిన విషయాల్లో సహజంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని స్పష్టం చేసింది. పిటిషనర్‌ దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదన్న తితిదే తరఫు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు.

స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంది

వైకుంఠ ఏకాదశి రోజు (2020 డిసెంబర్‌ 25) నుంచి భక్తులకు పది రోజులపాటు ఉత్తరద్వారం దర్శనం కల్పించేందుకు తితిదే బోర్డు చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ కేఎస్‌ సాయినాథ్‌శర్మ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పది రోజులు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచడం గత సంప్రదాయాలకు, ఆగమశాస్త్రానికి విరుద్ధమన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతుల అభిప్రాయాల్ని స్వీకరించకుండా తితిదే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఆర్థిక ప్రయోజనం పొందడం కోసం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు.

మఠాధిపతులతో సంప్రదింపులు జరిపింది

తితిదే తరఫు న్యాయవాది ఎ.సుమంత్‌ వాదనలు వినిపిస్తూ.. తితిదే నిర్ణయంపై అభ్యంతరం ఉంటే పిటిషనర్‌ దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలి కానీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. తితిదే నిర్ణయం వల్ల పిటిషనర్‌ హక్కులకు భంగం కలగనందున వ్యాజ్యం దాఖలు చేసే అర్హత ఆయనకు లేదన్నారు. తితిదే బోర్డు ఐదుగురు సభ్యులతో నియమించిన ఉపకమిటీ.. ఆగమ సలహా సంఘం, వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులతో సంప్రదింపులు జరిపిందని చెప్పారు. ఆ కమిటీ నివేదిక మేరకే వైకుంఠ ద్వారం పది రోజులు తెరవాలని తితిదే తీర్మానించిందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వ్యాజ్యాన్ని కొట్టేశారు.

ఇదీ చదవండి:

హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమే: పవన్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.