ETV Bharat / city

పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు: ఎస్​జీపీ - schools reopening latest news

పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్‌ హైకోర్టుకు తెలిపారు. పది పరీక్షల విషయంలో.. ప్రభుత్వం జూలైలో నిర్ణయం తీసుకోనుందని చెప్పారు.

high court
హైకోర్టు
author img

By

Published : May 28, 2021, 9:19 AM IST

పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రభుత్వం వాయిదా వేసిందని.. దీనిపై జూలైలో నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్‌ హైకోర్టుకు తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. స్కూల్స్​ రీఓపెనింగ్​, పది పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమౌతోందన్న పిటిషనర్​ మాటల్లో నిజం లేదన్నారు. వాటికి సంబంధించిన వివరాలు నమోదు చేసిన హైకోర్టు.. కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు.. జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

రాష్ట్రంలోని పాఠశాలల పునఃప్రారంభం, పదో తరగతి పరీక్షల నిర్వహణకు ముందు ఉపాధ్యాయులందరికీ కొవిడ్ టీకా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు వై.ఉమాశంకర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. టీచర్లకు వ్యాక్సిన్ ఇవ్వకుండా జూన్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభించడానికి, జూన్ 7 నుంచి పది పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని కోరారు. కొవిడ్​ రెండో దశ వ్యాప్తితో రాష్ట్రవ్యాప్తంగా 400మంది ఉపాధ్యాయులు మృతి చెందినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది పొత్తూరి సురేశ్ కుమార్ వాదనలు వినిపించారు. టీచర్లందరికీ వ్యాక్సిన్​ ఇచ్చాకే స్కూల్స్​ ప్రారంభించాలన్నారు. అప్పుడే పది పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా కేంద్రం గుర్తించలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఉపాధ్యాయులందరికీ టీకా వేయటం కుదరదన్నారు.

ఇదీ చదవండి: అర్హులైన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలి : మంత్రి రామచంద్రారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.