ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎస్‌ఈసీకి లేదని పలువురు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఏకగ్రీవాలు అయిన స్థానాలకు డిక్లరేషన్‌కు సంబంధించి.. ఫాం-10 ఇచ్చి ఉంటే.. ఎస్‌ఈసీ విచారణ జరపవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు ఈ నెల 23 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇవ్వకుంటే విచారణ జరిపిన తర్వాత... ఫలితాలు వెల్లడించవద్దని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: