ETV Bharat / city

పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయలేం: హైకోర్టు - ap high court on local body elections latest news

ap-high-court
ap-high-court
author img

By

Published : Dec 8, 2020, 11:12 AM IST

Updated : Dec 9, 2020, 2:30 AM IST

11:09 December 08

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు

 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్​ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ.. పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించారు. ఎస్​ఈసీప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేస్తూ... మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఇటీవలే వాదనలు వినిపించారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతోనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించామని ...మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ఎస్​ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ కోర్టును కోరారు . ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు. మంగళవారం నిర్ణయాన్ని వెల్లడిస్తూ......ఈ దశలో ఎస్​ఈసీ ప్రొసీడింగ్స్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు.

 రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ... కరోనా కారణంగా వాయిదా పడిందనే అంశాన్ని కోర్టు ముందు ఎస్​ఈసీ తరఫు న్యాయవాది లేవనెత్తారు . వాస్తవాల హేతుబద్ధతను పరిగణనలోకి తీసుకోకుండా ఎస్​ఈసీ ప్రొసీడింగ్స్ ఇచ్చిందని ఏజీ కోర్టుకు విన్నవించారు. ప్రొసీడింగ్స్ లోని వివరాల్ని ప్రస్తావిస్తూ ఎన్నికల నిర్వహణ విషయంలో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమైందని....ఎస్​ఈసీ న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకుందన్నారు . ఈ దశలో ఎవరి వాదన సరైనది అనేది కోర్టు నిర్ణయించలేదని ధర్మాసనం పేర్కొంది. ప్రొసీడింగ్స్ లోని అంశాలు సరైనవా కాదా అనే విషయాన్ని నిర్ణయించలేమని.... ప్రొసీడింగ్స్ జారీచేయడానికి ఎస్​ఈసీ పరిగణనలోకి తీసుకున్న మెటీరియల్ ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. నిర్ణయానికి గల కారణాల్ని ఎస్​ఈసీ  వివరించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎస్​ఈసీ కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందని …ఈ వ్యాజ్యంలో తుది ఉత్తర్వులు జారీచేయడానికి ముందు లోతైన విచారణ అవసనరమని ధర్మాసనం అభిప్రాయపడింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఇది సరైన దశ కాదని....విచారణను ఈనెల 14 కు వాయిదా వేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. ఎస్​ఈసీ కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ఆదేశించారు.

ఇదీ చదవండి:  పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

Last Updated : Dec 9, 2020, 2:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.