ETV Bharat / city

ఉద్యోగుల ఆరోగ్యంపై జాగ్రత్త వహించరా? - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమలోని కొందరు ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతం అధికంగా ఉండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఉద్యోగుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించరా? అని యాజమాన్యాన్ని ప్రశ్నించింది.

hc on employees
hc on employees
author img

By

Published : Oct 29, 2021, 8:23 AM IST

అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమలోని కొందరు ఉద్యోగుల రక్తంలో సీసం(లెడ్‌) శాతం అధికంగా ఉండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఉద్యోగుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించరా? అని యాజమాన్యాన్ని ప్రశ్నించింది. పరిశ్రమలో పీసీబీ అధికారులు చేపట్టిన తనఖీ నివేదిక, ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ ఇచ్చిన లేఖను కోర్టు ముందు ఉంచాలని ఏపీ పీసీబీ, ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. పరిశ్రమ మూసివేతకు పీసీబీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పొడిగించింది.

విచారణను నవంబరు 9కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. పర్యావరణ నిబంధనలను పాటించలేదన్న కారణంతో పరిశ్రమ మూసివేత నిమిత్తం పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ అధీకృత అధికారి నాగుల గోపీనాథ్‌రావు హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అవి గురువారం విచారణకు వచ్చాయి.

తనిఖీ నివేదిక కోర్టు ముందు లేకపోవడంతో విచారణను వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఉద్యోగుల రక్తంలో సీసం ఉన్నట్లు రికార్డుల్లోని వివరాలను పరిశీలించి పై విధంగా వ్యాఖ్యానించింది. అమరరాజా తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు స్పందిస్తూ... తదుపరి విచారణలో అన్ని వివరాలను నివేదిస్తామన్నారు.

ఇదీ చదవండి: AP Cabinet decisions : ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం...త్వరలో ఆర్డినెన్స్‌ జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.