ETV Bharat / city

ap High Court On House Sites: మహిళకు ఇంటి పట్టా ఇస్తే ఆ కుటుంబం లబ్ధిపొందినట్లే: హైకోర్టు - నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం తాాజా వార్తలు

ap high court on house sites: 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం'లోని లోపాల్ని ఎత్తిచూపుతూ.. ఈ ఏడాది అక్టోబర్ 8న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ వేసింది. అప్పీల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. "నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం" కింద ఇంటి స్థలాలు పొందినవారి హక్కులపై సింగిల్ జడ్జి తీర్పు ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ.. నేటికి వాయిదా వేసింది.

ap High Court On House Sites
ఏపీ హైకోర్టు
author img

By

Published : Nov 25, 2021, 7:04 AM IST

'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం' కింద ఇంటి స్థలాలు పొందినవారి హక్కులపై సింగిల్ జడ్జి తీర్పు ప్రభావం చూపుతుందని హైకోర్టు(ap hc on on house sites under navaratnalu pedalandariki illu scheme) ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీచేసి వాదనలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చిఉండాల్సిందని అభిప్రాయపడింది. సహజ న్యాయసూత్రాల ప్రకారం ఇప్పటికే ఇళ్ల పట్టాలు పొందిన మహిళల వాదన వినడం సరైనది విధానం అని స్పష్టంచేసింది. వారి పేరున ఇప్పటికే ఇంటి పట్టాలు రిజిస్టర్ అయ్యాయని గుర్తుచేసింది. మహిళకు ఇంటి పట్టా ఇస్తే కుటుంబ సభ్యులందరికి లబ్ధిపొందినట్లే కాదా ? అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వందశాతం సంతృప్తి సాధ్యంకాదని..ఇళ్ల స్థలాలు కేటాయింపు నిరంతర ప్రక్రియ అని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి. కృష్ణమోహన్​తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలోని లోపాల్ని ఎత్తిచూపుతూ వాటిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసేంత వరకు స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఈ ఏడాది అక్టోబర్ 8న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ వేసింది. తాజాగా జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ , అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి వద్ద మొత్తం 128 వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. వారిలో 55 మందికి మంజూరు చేశామన్నారు. 46 మంది ఎవరో అధికారులు కనుగొనలేకపోయామన్నారు. 12 మంది ఇంటి స్థలం కోసం దరఖాస్తే చేయలేదన్నారు. 9 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారన్నారు. మరికొంత మంది రెండు సార్లు దరఖాస్తు చేశారని తెలిపారు. వ్యాజ్యం దాఖలు చేసిన వారిలో 51 మంది మహిళలే ఉన్నారన్నారు. కుటుంబంలో మహిళలేని పక్షంలో పురుషులకు ఇంటిస్థలం ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారు. ఆ మేరకు న్యాయస్థానానికి హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే.. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూసేకరణ నిమిత్తం రూ .10 వేల కోట్లు, ఇళ్ల నిర్మాణాల కోసం రూ. 1800 కోట్లు ఖర్చు చేశామన్నారు. మహిళలు దరఖాస్తు చేయని కుటుంబంలో 77 వేల మంది పురుషులకు పట్టాలిచ్చామన్నారు.

అదనపు వివరాలతో అఫిడవిట్ వేయండి..

అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాల్ని సింగిల్ జడ్జి తీర్పులోప్రస్తావించారన్నారు. కొన్ని అంశాలపై వాదనలు చెప్పుకునే అవకాశం సింగిల్ జడ్జి ఇవ్వలేదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, బిల్డింగ్ కోడ్ నిబంధలనకు అనుగుణంగా మహిళలకు ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఆ నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం వాటాగా నిధులు కేటాయించిందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. ఆ వివరాలతో అదనపు అఫిడవిట్ వేయాలని ఏజీకి స్పష్టం చేసింది. దానిపై స్పందన తెలపాలని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది వీఎస్ఆర్ అంజనేయులుకు సూచించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.

100 % మహిళలకే ఇవ్వడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించారన్నారు

సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం దాఖలు చేసిన తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది తరపున సీనియర్ న్యాయవాది వీఎస్ఆర్ ఆంజనేయులు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి లోతైన విచారణ జరిపారన్నారు. ఇంటి పట్టాలు 100 % మహిళలకే ఇవ్వడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించారన్నారు. మహిళలతో పాటు అర్హులైన పురుషులకు, ట్రాన్స్ జెండర్లకు పట్టాలివ్వాలని ఆదేశించారన్నారు. మహిళలకే ఇంటి పట్టాలిస్తామని ప్రభుత్వం పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధం అనేది తన ప్రధాన అభ్యంతరం అన్నారు. పిటిషనర్లు అందరూ పేదలన్నారు. అర్హులైనప్పటికీ ఇప్పటి వరకు పట్టాలివ్వలేదన్నారు. ప్రభుత్వం సింగిల్ జడ్జి వద్ద వాదనలు వినిపించలేదని చెప్పడం వాస్తవం కాదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు కోసం ఇంటి స్థలం కేటాయించడాన్ని సింగిల్ జడ్జి తీవ్రంగా ఆక్షేపించారన్నారు. అందులో నిర్మాణాలు నేషనల్ బిల్డింగ్ కోడ్​కు విరుద్ధమని((hc navaratnalu pedalandariki illu scheme)) పేర్కొన్నారన్నారు. ఇళ్ల స్థలాల పథకాన్ని తాము తప్పుపట్టడం లేదన్నారు. 100 % స్థలాలు మహిళలకే ఇస్తామనడంపైనే అభ్యంతర అన్నారు.

ఆ వాదనలపై ధర్మాసనం(hc navaratnalu pedalandariki illu scheme) స్పందిస్తూ .. ఇప్పటికే లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలు ఇచ్చారని గుర్తుచేసింది. భూమిని స్వాధీన పరిచారని తెలిపింది. వారికి నోటీసులు ఇవ్వకుండా... వాదనలు చెప్పుకునే అవకాశం లేకుండా చేయడం సరికాదని అభిప్రాయపడింది. పట్టాలు పొందిన వారిని కనీసం ఒక్కరినైనా ప్రతివాదిగా పేర్కొనలేదని వ్యాఖ్యానించింది. వంద , రెండొందలమంది దాఖలు చేసిన వ్యాజ్యాల్లో పట్టాలు పొందిన లక్షలమంది లబ్ధిదారుల హక్కులు సింగిల్ జడ్జి తీర్పుతో ప్రభావితం అవుతున్నాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం సరైందా ? కాదా ? తేల్చాలంటే ఈ వ్యవహారాన్ని ప్రజాహిత వ్యాజ్యం రూపంలో విచారించి ఉండాల్సిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. పీఏంఏవై పథకం మార్గదర్శకాలేమిటీ అనే విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆ వివరాల్ని ధర్మాసనం ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతివాదిగా అనుమతించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామన్నారు.

ఇదీ చదవండి..

Dr. Sudhakar case: నేరస్థులను రక్షించాలనుకుంటున్నారా.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.