రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఉద్యమిస్తున్న రైతులు, మహిళల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించిన తీరుపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేసి.. నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరపున వాదించిన ఆడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్....అమరావతి గ్రామాల్లో ఇప్పటి వరకు 401 నిరసన కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. వాటిలో ఎక్కువ కార్యక్రమాలకు పోలీసుల అనుమతి లేదన్నారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. పోలీసులపై చర్యలకు సంబంధించిన... తుది నివేదిక సిద్ధమవుతోందని చెప్పారు. పిటిషనర్ల తరపున వాదించిన దమ్మాలపాటి శ్రీనివాస్... పోలీసులపై చర్యల విషయంలో మధ్యంతర నివేదికను మాత్రమే ప్రభుత్వం అందజేసిందన్నారు. కొంత సమయమిచ్చి తుదినివేదికను న్యాయస్థానానికి సమర్పించేలా ఆదేశించాలని ఆయన కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... నాలుగు వారాల గడువిస్తూ తుది నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం అందజేసిన వివరాలపై తిరిగి పిటిషన్ వేయాలని పిటిషనర్లకు సూచించింది.
'పోలీసులు దురుసు ప్రవర్తనపై నివేదిక ఇవ్వండి' - high court about amaravathi fight
అమరావతి ఆందోళనలో... అన్నదాతలు, మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై 4వారాల్లో విచారణ పూర్తిచేసి నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న మహిళలు, రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై ' ఈనాడులో ప్రచురించిన కథనాలను సుమోటో పిల్‌గా పరిగణించడంతో పాటు, 144 సెక్షన్ విధించడాన్ని సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.