ETV Bharat / city

సీఆర్‌డీఏ చట్టం రక్షణ ఉండగా ఈ కేసు ఎలా చెల్లుతుంది?.. రాజధాని భూములపై హైకోర్టు - ఏపీ తాజా వార్తలు

Narayana bail petition: రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పలువురిపై నమోదు చేసిన కేసులో బెయిల్​ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్​లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటీషనర్ల తరపు వాదనలు విన్న న్యాయస్థానం... సీఐడి తరపు వాదనలు కోసం తదుపరి విచారణను ఈనెల 15 వతేదీకి వాయిదా వేసింది. తొందరపాటు చర్యలు వద్దని హితవు పలికింది.

AP High Court
పిటిషన్​లపై హైకోర్టు విచారణ
author img

By

Published : Jun 10, 2022, 7:07 AM IST

Narayana bail petition: సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్ణయాల విషయంలో అధికారులకు, ప్రభుత్వానికి ప్రాసిక్యూషన్‌ నుంచి రక్షణ ఉన్నప్పుడు సీఐడీ పెట్టిన కేసు ఎలా చెల్లుతుందని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఆదేశాలిచ్చారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది.

ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్‌ డైరెక్టర్‌ కె.పి.వి.అంజనీకుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌, ఆయన సోదరుడు రాజశేఖర్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై గురువారం విచారణ ప్రారంభం కాగానే సీఐడీ తరఫు న్యాయవాది చైతన్య స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాలపై అదనపు ఏజీ వాదనలు వినిపించేందుకు విచారణను వారంరోజులు వాయిదా వేయాలని కోరారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా కోరారు కదా అని న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ముందస్తు బెయిలు పిటిషన్ల విషయంలో నిర్దిష్ట సమయంలో విచారణ జరపాల్సి ఉందన్నారు.

భూములివ్వడమే మా పాపమా?: పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. అమరావతిలో భూములుండటం, రాజధాని కోసం భూములివ్వడమే పాపంలా, నేరంలా ఉందన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు భూసేకరణే జరగలేదు.. నిర్మాణమూ చేపట్టలేదు.. అలాంటప్పుడు అనుచిత లబ్ధి పొందడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాజధాని విషయంలో నిర్ణయాలకు సీఆర్‌డీఏ చట్టం నుంచి రక్షణ ఉందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం ప్రభుత్వాన్ని, అధికారులను విచారించకుండా నిషేధం ఉందని వివరించారు. పిటిషనర్లను వేధించడం కోసమే సీఐడీ కేసు నమోదు చేసిందని ఆరోపించారు.

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు విషయంలో 2016లో రైతుల నుంచి ఫిర్యాదు అందితే ఆరేళ్ల తర్వాత సీఐడీకి ఫిర్యాదు చేయడం వెనుక వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పిటిషనర్లకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. ‘ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వ్యవహారంలో ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ అయినప్పుడు 1100కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. తుది నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు ఎవరూ అభ్యంతరం లేవనెత్తలేదు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సైతం అప్పట్లో అభ్యంతరం చెప్పలేదు.

రహదారి నిర్మాణమే జరగనప్పుడు ప్రభుత్వానికి రూ.780 కోట్ల నష్టం ఎలా జరుగుతుంది? అప్పట్లో అభ్యంతరం లేవనెత్తిన రైతులను సీఐడీ దర్యాప్తు పేరుతో పిలిచి నష్టం జరిగినట్లుగా అఫిడవిట్‌ ఇవ్వాలని బెదిరిస్తోంది. మాజీమంత్రి నారాయణకు రాజధాని ప్రాంతంలో భూములే లేవు. లింగమనేని సోదరులకు 2014కు పూర్వమే అక్కడ భూములున్నాయి. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కోసం 14 ఎకరాలు ఇచ్చారు. భూములివ్వడం ద్వారా నష్టపోయింది వారే.

పిటిషనర్లకు లబ్ధి చేకూరిందనే విషయాన్ని సీఐడీ ప్రాథమికంగా తేల్చలేకపోయింది. ఫిర్యాదు చేయడంలో ఇంత జాప్యం ఎందుకో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదు. ఫిర్యాదులోనివన్నీ నిరాధార ఆరోపణలే’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారి వాదనలు ముగియడంతో సీఐడీ తరఫున అదనపు ఏజీ వాదనల కోసం న్యాయమూర్తి విచారణను ఈనెల 15కు వాయిదా వేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.