ETV Bharat / city

మూడు రాజధానులు, మండలి రద్దు పిటిషన్లు​ త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ

మూడు రాజధానులు, సీఆర్​డీఏ, మండలి రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనానికి హైకోర్టు బదిలీ చేసింది. తెదేపా ఎమ్మెల్సీ దీపక్​ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు..గతంలో దాఖలైన వ్యాజ్యాలను సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారిస్తున్న కారణంగా ప్రస్తుత వ్యాజ్యాలను అక్కడే విచారించాలని తెలిపింది. ఈ వ్యాజ్యలపై అత్యవసర విచారణ అవసరమన్న పిటిషనర్ వాదనలను పరిగణనలోకి న్యాయమూర్తి.. తక్షణం ఫైళ్లను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

ap high  court
ap high court
author img

By

Published : Jul 8, 2020, 7:50 PM IST

Updated : Jul 9, 2020, 12:06 AM IST

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని జూన్ 16న శాసనసభలో తిరిగి ప్రవేశపెట్టడం, శాసనమండలి రద్దుకు శాసనసభ చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్ని త్రిసభ్య ధర్మాసనానికి హైకోర్టు నివేదించింది. సంబంధిత ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ముందు ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. బిల్లుల్ని ఓ సారి సెలెక్టు కమిటీకి సిఫారసు చేశాక మళ్లీ శాసనసభలో ఎలా పెడతారని ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.

పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ చట్టం రద్దు బిల్లులను సెలక్టు కమిటీకి పంపకపోవడాన్ని సవాలు చేస్తూ గతంలోనూ ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. మరోవైపు ఏపీ శాసన మండలిని రద్దు చేయాలని పార్లమెంట్​ను విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యాజ్యాలన్నింటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. ఈ అంశంతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలు సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుపుతున్న నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాలను కూడా అక్కడే విచారణ జరపాలని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ .. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 14 లోపు విచారణ జరిపి నిర్ణయం వెల్లడించకపోతే తాము దాఖలు చేసిన వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. ఫైళ్లను తక్షణం సీజే ముందు ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.

ఇదీ చదవండి:

రైతు దినోత్సవం కాదు.. రైతు సొమ్ము దుబారా దినోత్సవం: దేవినేని

Last Updated : Jul 9, 2020, 12:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.