ETV Bharat / city

ఈఎస్‌ఐ వ్యవహారంపై హైకోర్టులో విచారణ... ఈ నెల 25కు వాయిదా

ఈఎస్‌ఐ కేసులో రమేశ్‌కుమార్‌ అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించని అనిశా అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ తరుపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

AP High Court hearing on Ramesh Kumar's arrest in ESI case
ఈఎస్‌ఐ వ్యవహారంపై హైకోర్టులో విచారణ
author img

By

Published : Jun 18, 2020, 4:52 PM IST

ఈఎస్ఐ కేసులో రమేశ్‌కుమార్‌ అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై... హైకోర్టు విచారణ జరిపింది. అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించని అనిశా అధికారులపై చర్యలు తీసుకోవాలని... పిటిషనర్ కోరారు. అరెస్టుకు ముందు నోటీసు ఇవ్వనందున రమేశ్‌కుమార్‌ను విడుదల చేయాలన్నారు. అరెస్టు తర్వాత నోటీసు ఇచ్చారని... పిటిషనర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. విజయవాడలో రమేశ్‌కుమార్‌కు అనిశా డీఎస్పీ... 41ఏ నోటీసు నేరుగా ఇచ్చారని తెలిపారు. అందులోనూ... సమయం, ఎప్పుడు రావాలి అన్నదానితో పాటు అధికారుల సంతకాలు లేవని స్పష్టం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.... తదుపరి విచారణ ఈనెల 25కు వాయిదా వేసంది.

ఇదీ చదవండి: 'అన్ని పిటిషన్​ల పై ఒకేసారి విచారణ చేపడతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.