పుర, నగరపాలక ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభింస్తూ.. జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని ఎస్‌ఈసీ హైకోర్టులో వాదనలు వినిపించింది. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక వ్యాజ్యాలు దాఖలు చేయడానికి వీల్లేదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ తెలిపారు. ప్రభుత్వం ఎస్ఈసీతో సంప్రదింపులు జరిపాకే పుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఆ ప్రక్రియను ఆటంకం లేకుండా కొనసాగనీయాలని కోరారు. కరోనా వల్ల వాయిదా పడ్డ ఎన్నికలను సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక పునరుద్ధరిస్తామంటూ గతంలో ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను పిటిషనర్లు సవాల్ చేయలేదని గుర్తు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి
అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్... 'ఈబీసీ నేస్తం'కు కేబినెట్ ఆమోదం