లాక్‌డౌన్ నిబంధనలను ప్రజాప్రతినిధులే పాటించకపోతే ఎలా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం... నిబంధనలు అందరూ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఉన్నతస్థాయి విచారణ చేయించాలా అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు....తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: