ETV Bharat / city

High Court Fire On State Govt: వెబ్‌సైట్‌లో జీవోల కేసు.. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం - ap high court on hiding gos in state

ఏపీ హైకోర్టు
ap high court fire on state govt
author img

By

Published : Dec 22, 2021, 12:24 PM IST

Updated : Dec 22, 2021, 1:03 PM IST

12:21 December 22

ap high court fire on state govt: వెబ్‌సైట్‌లో జీవోలు పెట్టకపోవడంపై హైకోర్టు ఫైర్

AP High Court on Hiding State Govt GO's: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టట్లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై ధర్మాసనం మండిపడింది. అన్ని జీవోల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం.. విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

జీవోల అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ తీరు.. సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని, ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోల్లో 5 శాతమే వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది.. అతి రహస్య జీవో మాత్రమే అప్‌లోడ్‌ చేయట్లేదని కోర్టుకు తెలిపారు.

AP High court on Hiding GOs: ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. జీవోలు రహస్యం, అతిరహస్యమని ఎలా నిర్ణయిస్తారని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అన్ని జీవోల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించిన హైకోర్టు.. వెబ్‌సైట్‌లో ఉంచిన, రహస్య జీవోల వివరాలు తెలపాలని స్పష్టం చేసింది. అనంతరం విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి...

Ashok Fires On Govt: రామతీర్థం బోడికొండపై ఉద్రిక్తత.. రామాలయ శంకుస్థాపనలో తోపులాట

Last Updated : Dec 22, 2021, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.