Farewell to Justice M. Venkataraman: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ పదవీ విరమణ సందర్భంగా.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిన్ వెంకటరమణ పదవీ కాలం శుక్రవారం ముగియడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర అధ్యక్షతన వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిన్ వెంకటరమణ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. జస్టిన్ వెంకటరమణ అందించిన న్యాయసేవలను హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర కొనియాడారు. హైకోర్టు న్యాయమూర్తిగా 2900 కేసులకు పైగా పరిష్కరించారని గుర్తుచేశారు. వెంకటరమణ శేష జీవితం ఆయురారోగ్యాలతో ప్రశాంతకంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
కోర్టులకు నిష్పాక్షికత, పారదర్శకత ప్రామాణిక చిహ్నాలని జస్టిస్ వెంకటరమణ అన్నారు. అవి ఎప్పుడూ కొనసాగాలని అభిలషించారు. తన ఎదుగుదలకు, న్యాయమూర్తిగా సేవలు అందించడంలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్. శ్రీరామ్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, బాక్ కౌన్సిల్ చైర్మన్ గంబా రామారావు, సహాయ సొలిసిటర్ జనరల్ హరినాద్.. జస్టిస్ వెంకటరమణ అందించిన న్యాయసేవలను గుర్తుచేశారు. మరోవైపు జస్టిస్ వెంకటరమణ దంపతులను ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఇదీ చదవండి: