బైరైటీస్ గనుల తవ్వకాలకు అనుమతి దరఖాస్తును అధికారులు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సతీమణి విజయ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఖనిజాలు, గనులు, జంతుజాలం వంటి సహజవనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత... ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడిపైనా ఉందని గుర్తు చేసింది.
అనంతపురం జిల్లా పుట్టులు మండలం యెల్లుట్ల పరిధిలోని 2 హెక్టార్ల భూమిలో బైరైటీస్ తవ్వకాలకు అనుమతించాలని కోరుతూ..... జేసీ విజయ చేసిన దరఖాస్తును గనుల శాఖ డైరెక్టర్ తిరస్కరిస్తూ గత డిసెంబర్ 3న ఉత్తర్వులిచ్చారు. వాటిని సవాల్ చేస్తూ జేసీ విజయ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. విజయ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది.
ఇదీ చదవండి: