ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై చర్యలకు హైకోర్టు ఆదేశించింది. సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సత్యనారాయణను అదుపులోకి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలు అమలుచేసినప్పటికీ గత వాయిదాకు సత్యనారాయణ ఆలస్యంగా హాజరయ్యారు. కేసు విచారణలో సత్యనారాయణ కోర్టుకు ఆలస్యంగా వచ్చారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా ఉంటుందని న్యాయమూర్తి వెల్లడించారు. రూ.50 వేలు జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని తెలిపారు. వారెంట్ రీకాల్ కోసం సత్యనారాయణ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. శిక్షను నిలిపి వేయాలని సత్యనారాయణ, ఆయన తరపు న్యాయవాది కోరారు. సత్యనారాయణ విజ్ఞప్తిని లంచ్ తర్వాత పరిశీలిస్తా మని హైకోర్టు పేర్కొంది.
ఇదీ చదవండి: