ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించేలా మీడియాతో మాట్లాడొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియాతో మాట్లాడొద్దని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. అప్పీల్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు తీర్పును వెలువరించింది. ఎస్ఈసీ, కమిషనర్‌ను లక్ష్యంగా చేసుకుని, వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. పూర్తిగా మీడియాతో మాట్లాడవద్దు అని చెప్పటం రాజ్యాంగ పరంగా వ్యక్తికి ఇచ్చిన స్వేచ్ఛకు భంగం కలిగినట్లేనని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది.
ఎన్నికల ప్రక్రియపైనా.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, కమిషనర్‌ను, ఎన్నికల్లో భాగస్వాములైన అధికారుల్ని తక్కువ చేసి మాట్లాడటం, ప్రతిష్టను దిగజార్చడం చేయబోనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టుకు హామీ ఇస్తే తగిన ఉత్తర్వులు ఇస్తానని గత విచారణలో న్యాయస్థానం.. పిటిషనర్ న్యాయవాదిని కోరగా ఆయన హామీ ఇస్తూ మెమో దాఖలు చేశారు. మంత్రి హామీ ఇస్తే తమకు అభ్యంతరం లేదని ఎస్ఈసీ తరఫు న్యాయవాది తెలపటంతో ఇరువురి వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అనుబంధ కథనాలు..