మానవ హక్కుల కమిషన్ కార్యాలయంతోపాటు ఫిర్యాదులు స్వీకరించేందుకు యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌కు ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ (ఏపీసీఎల్‌ఏ) రాష్ట్ర కమిటీ సభ్యులు, న్యాయవాది పగిడిపల్లి రాము శుక్రవారం ఫిర్యాదు చేశారు.
సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవులను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. వారు బాధ్యతలు తీసుకొని పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఫిర్యాదుల స్వీకరణకూ యంత్రాంగం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: