రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా మంగళవారం మరో వెయ్యి కోట్ల రుణం సమీకరించింది. ఆరేళ్ల కాలానికి 6.39 శాతం వడ్డీతో రిజర్వు బ్యాంకు నిర్వహించిన వేలంలో ఈ మొత్తం సమీకరించింది. దీంతో ఏప్రిల్‌లో స్వీకరించిన అప్పు 4వేల కోట్ల రూపాయలకు చేరింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలో 5 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 9కోట్ల రూపాయలు సెక్యూరిటీల వేలం ద్వారా సమకూర్చుకుంది. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో కేంద్ర పన్నుల్లో వాటాలు, జీఎస్టీ ఆదాయం, కేంద్రం ఇచ్చే ఇతరత్రా నిధులు, రాష్ట్రం చేసే అప్పులు.. కీలకమయ్యాయి. తాజాగా కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు సడలించి రాష్ట్ర జీఎస్‌డీపీలో అయిదు శాతం వరకు వివిధ షరతులతో రుణ సమీకరణకు వెసులుబాటు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమూ తొలి త్రైమాసికంలో అదనంగా 10 వేల కోట్ల రూపాయల రుణానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత సడలింపులతో 5వేల కోట్ల రూపాయల వరకు అదనంగా రుణం సమకూర్చుకునే వెసులుబాటు ఏర్పడింది.
ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మరో అడుగు