ETV Bharat / city

శ్రీశైలం ప్రమాద ఘటనపై గవర్నర్, సీఎం తీవ్ర దిగ్భ్రాంతి - శ్రీశైలం పవర్ ప్లాంట్ ఫైర్ యాక్సిడెంట్

తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాద ఘటన తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.

శ్రీశైలం విద్యుత్ కేంద్ర ప్రమాదంపై గవర్నర్, సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

author img

By

Published : Aug 21, 2020, 9:01 PM IST

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద భూగర్భ హైడల్ పవర్ హౌస్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన ప్రమాదం కారణంగా తొమ్మిది మంది ఉద్యోగులు మరణించగా, 15 మందిని రక్షించారని తెలిపారు. పవర్‌హౌస్ లోపల చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులను రక్షించడం సాధ్యం కాని పరిస్థితిలో వారు మృతి చెందటం పట్ల గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది ఉద్యోగులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ తన సంతాపం తెలిపారు.

తీవ్రంగా కలచివేసింది : సీఎం జగన్

తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని సీఎం ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇదీ చదవండి : శ్రీశైలం దుర్ఘటనలో 9మంది మృతి... ప్రమాదంపై సీఐడీ విచారణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.