ETV Bharat / city

ఏవోఆర్​గా నాగేశ్వరరెడ్డి సేవల ఉపసంహరణ - advocate nageshwara reddy news

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ తరుఫున పిటిషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసే అడ్వొకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) బాధ్యతలు నిర్వర్తిస్తున్న న్యాయవాది జి. నాగేశ్వరరెడ్డి సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ap govt
ap govt
author img

By

Published : Jun 9, 2020, 6:12 AM IST

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ తరుఫున పిటిషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసే అడ్వొకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) బాధ్యతలు నిర్వహిస్తున్న న్యాయవాది జి. నాగేశ్వరరెడ్డి సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అసాన్ నజ్కీ ఒక్కరే ఏవోఆర్​గా కొనసాగుతారని పేర్కొంది. న్యాయ శాఖ కార్యదర్శి జి. మనోహర్ రెడ్డి సోమవారం ఈ మేరకు జోవో జారీ చేశారు.

సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏవోఆర్​లుగా న్యాయవాది నజ్కీ, నాగేశ్వరరెడ్డి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జులై 1న ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు హైకోర్టులో వాదనలు వినిపించేందుకు నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులప పనితీరుపై సమీక్ష జరుగుతున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.