రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెనుకబడిన తరగతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా జి. అనంత రామును నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. కె. ప్రవీణ్ కుమార్ను సాధారణ పరిపాలన శాఖలోని సంస్కరణల విభాగానికి బదిలీ చేశారు. ఏపీ కేడర్ కు వచ్చిన జి. జయలక్ష్మిని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగాల అదనపు బాధ్యతలను కూడా జి.జయ లక్ష్మికి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇదీ చదవండి