పరిమిత పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. జనవరిలో ఇతర పోటీ పరీక్షలు ఉన్నందున... ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరిలో నిర్వహించనుంది. ఇప్పటికే ప్రభుత్వం అనుమతించిన ఈ డీఎస్సీలో... కొన్నేళ్లుగా మిగిలిన బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు డీఎస్సీ-2018లో మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఖాళీల వివరాలు సేకరిస్తోంది.
టెట్ వల్ల కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున... దానితో సంబంధం లేకుండా డీఎస్సీ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. డీఎస్సీకి పాఠ్యప్రణాళికను మార్చే బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలికి అప్పగించారు. మరో వారంలో పాఠ్యప్రణాళిక ఖరారయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి