ETV Bharat / city

కరోనా కట్టడికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు - ఏపీ కరోనా వార్తలు

కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో కంట్రోల్​ రూమ్​లు, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో టాస్క్​ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అన్నిశాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జనతా కర్ఫ్యూను పూర్తిస్థాయిలో పాటించాలని ఆదేశించింది. జిల్లాల్లోని పరిస్థితులను ఆరోగ్యశాఖ మంత్రి సమీక్షించారు. కరోనా అనుమానితులు నిర్బంధంలో ఉండేందుకు నిరాకరిస్తే చట్టప్రకారం నిర్బంధంలో ఉంచాలని అధికారులను ఆదేశించింది.

Ap govt released guidelines on corona
కరోనా కట్టడికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు
author img

By

Published : Mar 21, 2020, 11:12 PM IST

కరోనా నిరోధక కార్యాచరణపై విస్తృతస్థాయిలో ప్రభుత్వం చర్యలు చేపట్టండి. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుతో పాటు.. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో మంత్రులు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్య సదుపాయాల కల్పనకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగానికి సూచనలు ఇచ్చింది. సర్వే, పర్యవేక్షణ, విస్తృత ప్రచారంతో పాటు ఆస్పత్రుల్లో చికిత్సలు కొనసాగించాలని ఆదేశించింది. ఒంగోలుతో పాటు, ఇతర జిల్లాలోని పరిస్థితిని ఆరోగ్యశాఖ మంత్రి సమీక్షించారు. జనతా కర్ఫ్యూ పాటించడంపై పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని సూచించారు. జనతా కర్ఫ్యూ పాటించేందుకు వ్యాపార, వాణిజ్య, ఇతర సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి .

కోవిడ్-19కి ఎపిడమిక్ డిసీజెస్ యాక్టు నిబంధనలు

కరోనా వైరస్ అనుమానిత కేసుల్లో ఐసోలేషన్​లో ఉండేందుకు నిరాకరిస్తే చట్టప్రకారం వారిని నిర్బంధంలో ఉంచేలా అధికారాలు వినియోగించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. స్థానిక ఆరోగ్యశాఖ అధికారికి సదరు అధికారాలను కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కనీసం 14 రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండేలా చూడాల్సిందిగా ఆదేశించింది. ఎపిడమిక్ డిసీజెస్ యాక్టు 1897 ప్రకారం కోవిడ్ -19 నిబంధనల మేరకు ఈ ఆదేశాలు వైద్యారోగ్యశాఖ జారీచేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తి నిరోధంతో పాటు ఆస్పత్రులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు వైద్యులతో కూడిన సాంకేతిక కమిటీని ప్రభుత్వం నియమించింది. వైద్య విద్యశాఖ డైరెక్టర్ నేతృత్వంలో 6గురు సీనియర్ వైద్యులు, పల్మనాలజిస్టులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇచ్చే బులెటిన్​లు సాంకేతిక సలహాలను రాష్ట్రంలో అమలుపర్చటంతో పాటు ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు దిల్లీలోని ఎయిమ్స్​ను సంప్రదించాల్సిందిగా సాంకేతిక కమిటీకి ఆదేశాలు ఇచ్చింది.

ఇదీ చదవండి : కరోనా వైరస్​పై పోరుకు భారత్​ సరికొత్త వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.