సీనియర్ రెసిడెంట్ వైద్యులు(senior resident doctors), పీజీలకు గౌరవ వేతనం(Honorarium) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం (ap govt) ఉత్తర్వులు ఇచ్చింది. వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారికి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. సీనియర్ రెసిడెంట్ వైద్యుల గౌరవ వేతనం రూ.70 వేలు, రెసిడెంట్ డెంటిస్టుల గౌరవ వేతనం రూ.65 వేలు, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టుల గౌరవ వేతనం రూ.85 వేలకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనం 2020 సెప్టెంబరు నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో వివరించారు.
ఇదీ చదవండి