ETV Bharat / city

Construction Works in Amaravati: అమరావతిలో మళ్లీ పనులు.. ప్రయత్నాల్లో సీఆర్డీఏ! - Amaravati issue news

Construction Works in Amaravati: 3 రాజధానుల నిర్ణయం వెనక్కు తీసుకున్న అనంతరం అమరావతి ప్రాంతంలో పనులను ప్రారంభించేందుకు సీఆర్డీఏ ప్రయత్నాలు చేస్తోంది. అమరావతిలోని పాలనా నగరంలో ఉన్న అఖిలభారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాలు ఇప్పటికే 80 శాతం మేర పూర్తి కావటంతో మిగతా పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఉద్ధృత స్థాయిలో పనులు చేపట్టకపోయినా త్వరలోనే వీటిని పూర్తి చేసి.. వీటిని హామీగా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.

Construction Works in Amaravati
Construction Works in Amaravati
author img

By

Published : Dec 31, 2021, 7:02 PM IST

Construction Works in Amaravati: రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్న అనంతరం అమరావతి ప్రాంతంలో పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీల లాంటి ప్రజాప్రతినిధులతోపాటు అఖిల భారత సర్వీసు అధికారుల కోసం 2017లో ప్రారంభించిన భవనాల సముదాయాలు దాదాపుగా పూర్తికావొచ్చాయి. ఇప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తికావటంతో మిగతా పనులు చేపట్టాలని సీఆర్డీఏ భావిస్తోంది.

భారీ స్థాయిలోనే వ్యయం..
Building Constructions in Amaravati: 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం అమరావతి మెట్రోరీజియన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో సీఆర్డీఏ తిరిగి అమల్లోకి వచ్చింది. దీంతో సీఆర్డీఏ ప్రాంతంలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే పనులు మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విజయవాడ- గుంటూరు పరిధిలో నివాసముంటున్న విభాగాధిపతులు, కమిషనర్లు, కార్యదర్శుల హోదాల్లోని అఖిలభారత సర్వీసు అధికారులకు 40 వేల చొప్పున అద్దె భత్యాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. విభజన అనంతరం ప్రతీ నెలా ఇది ప్రభుత్వానికి భారంగానూ మారింది. ఇప్పటికిప్పుడు భవనాల నిర్మాణాన్ని పునః ప్రారంభించకపోయినా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేయటంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ నిర్మాణాన్నిటికీ భారీ స్థాయిలోనే వ్యయం అయ్యే అవకాశముందని తెలుస్తోంది.

పనులను చూపించి.. బ్యాంకుల నుంచి రుణాలు!
రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల పనులు చేపట్టి వాటిని హామీగా చూపి బ్యాంకుల నుంచి రుణాల్ని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పనులు చేపట్టేందుకు కూడా అవసరమైన నిధులను సమీకరించేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

cinema tickets issue in AP: టికెట్ ధర, థియేటర్ల వర్గీకరణపై మరోసారి భేటీ.. ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.