రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 1,320 గ్రామాల్లో మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ప్రజాచైతన్యం, సమస్యల పరిష్కారం కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. కొవిడ్-19 నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేలా గ్రామాల్లో కార్యాచరణ చేపట్టనున్నారు.
ఇదీ చదవండి : చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. పని చేసే వ్యక్తే నిందితుడు