సర్కార్ ఉద్యోగులకు అత్యంత కీలకమైన పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటన దిశగా రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన గుప్పించే అవకాశాలు ఉన్నాయి. పీఆర్సీ అమలును వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నప్పటికీ బడ్జెట్ సమావేశాల్లోగా దీనిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
30 శాతం ఐఆర్ ఆశిస్తున్నారు..
ప్రస్తుత ఐఆర్‌ను కలిపి.. ఈ పెంపు 30 శాతం వరకూ ఉండొచ్చని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉగ్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
ఆ నివేదిక బయట పెట్టాలి..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. 11వ పీఆర్సీ ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను బయటపెట్టాల్సిందిగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదీ చదవండి