ETV Bharat / city

అందుబాటులో లేని నిధులు.. అందని ఏపీజీఎల్‌ఐ క్లెయిములు, రుణాలు - ap govt employees struggling to get claims and loans news

రాష్ట్ర‌ ప్రభుత్వ ఉద్యోగులు బీమా మొత్తం కింద ప్రభుత్వానికి చెల్లించే నిధి నుంచి క్లెయిమ్‌లు, రుణాలు పొందేందుకూ ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఈ మొత్తాల కోసం ఎదురుచూస్తున్నా అవి చాలా కాలం నుంచి పెండింగులో ఉన్నాయి. గత నెలలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా నిధులు అందుబాటులో ఉంచకపోవడంతో ఆ మొత్తాలు చెల్లించలేదు. ఇంతలో బడ్జెట్‌ ఫ్రీజ్‌ చేయడంతో ఉద్యోగులు నిరాశ చెందారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు బీమా
ap government
author img

By

Published : Mar 29, 2021, 5:31 AM IST

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ప్రతినెలా తమ మూలవేతనం నుంచి రాష్ట్ర‌ ప్రభుత్వ జీవిత బీమాకు, ప్రభుత్వ ప్రావిడెంట్‌ ఫండ్‌కు 9% వరకు చెల్లిస్తారు. మరికొందరు అదనపు మొత్తం కూడా జమచేస్తారు. పదవీవిరమణ 60 ఏళ్లయినా.. 58 ఏళ్ల వయసులోనే ఈ క్లెయిములు పరిష్కరిస్తారు. ఈ నిధి నుంచి కొందరు వ్యక్తిగత అవసరాల కోసం రుణాలకు దరఖాస్తు చేసుకుంటారు. నామమాత్రపు వడ్డీతో ప్రభుత్వం రుణాలు ఇస్తుంది. ఈ క్లెయిమ్‌లు, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఆ సొమ్ములు వస్తాయని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ జీవితబీమా డైరెక్టర్‌ ప్రతిపాదనల మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి జీఎల్‌ఐ క్లెయిమ్‌ల పరిష్కారానికి రూ.100 కోట్లకు, ఏపీజీఎల్‌ఐ పాలసీదారులకు రుణాలిచ్చేందుకు వీలుగా మరో రూ.50 కోట్లు విడుదల చేస్తూ బడ్జెట్‌, పాలనామోదం ఉత్తర్వులిచ్చింది. కానీ ప్రభుత్వం నిధులను అందుబాటులో ఉంచకపోవడంతో జీఎల్‌ఐ అధికారులు చెల్లింపులు చేయలేకపోయారు. హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ నుంచి నిధులు బదలాయించే అవకాశం కొద్దిసేపు వచ్చినా చెల్లింపులు పూర్తి చేసేవారమని జీఎల్‌ఐ ప్రాంతీయ అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు చెల్లించే అవకాశం లేదంటున్నారు.

ఇదీ చదవండి

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు గవర్నర్‌ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.