రాష్ట్రంలో ఇంధన రంగ స్వయం సమృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
కమిటీ సభ్యులుగా జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి, నాగరాజస్వామి, ఉషా రామచంద్రన్ ఉండనున్నారు. ఇంధనరంగ స్వయం సమృద్ధికి నిపుణుల కమిటీ కీలక సూచనలు చేయనుంది. ఇంధన శాఖలోని వివిధ విభాగాల్లో మానవ వనరుల వినియోగం, ఆర్థిక ఒడుదుడుకులపై అధ్యయనం చేసి.. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. నిపుణుల కమిటీ అధ్యయనానికి ఏ స్థాయి అధికారి నుంచైనా సమాచారం కోరే అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
రూ. 80 వేల కోట్ల అప్పు..
ఇంధన రంగానికి రూ.80 వేల కోట్ల మేర అప్పులున్నట్లు ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. డిస్కంలు రూ.30 వేల కోట్ల మేర నష్టాల్లో ఉన్నాయని తెలిపింది.
ఇదీ చదవండి: కొవిడ్ కేంద్రాల్లో ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటాం: ఆళ్ల నాని