దిల్లీలో నూతన పార్లమెంటు భవనం, సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... ప్రధానికి లేఖ ద్వారా అభినందనలు తెలిపారు. కొత్త పార్లమెంటు భవనం భారత ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఉంటుందని... ఇది కచ్చితంగా దేశ భవిష్యత్తు ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ భవనాన్ని నిర్దేశిత కాలంలో విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ రాజ్‌భవన్ నుంచి గవర్నర్ వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఇదీ చదవండి