ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణపతకం సాధించిన భారత జట్టును ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌లు అభినందించారు. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, హరికృష్ణ, దివ్య, నిహాల్, విధిత్‌లు పోటీలో సరైన ఎత్తుగడలు వేసి గొప్ప విజయాన్ని అందించారని సీఎం జగన్ పేర్కొన్నారు. ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించడం గర్వకారణమని...భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ బిశ్వభూషణ్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు స్వర్ణం