ప్రభుత్వ, కార్పొరేషన్ల స్థలాలు, స్థానిక సంస్థలకు చెందిన స్థలాల్లోనూ, భవనాలపై ఏపీ టవర్స్ లిమిటెడ్ (ఏపీటీఎల్), డిజిటల్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌తో సంయుక్త వెంచర్‌గా కమ్యూనికేషన్ టవర్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టవర్స్ లిమిటెడ్ నోడల్ ఏజెన్సీగా ఉండే ఈ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వం రూ.కోటి పెట్టుబడి పెట్టనుంది. జాయింట్ వెంచర్‌గా నియమించిన సంస్థ అయిదేళ్లలో రూ.2 వేల కోట్లు వెచ్చించి, 12 వేల టవర్లు నిర్మించనుంది.
టవర్ ఏర్పాటు కోసం 15ఏళ్ల కాలానికి స్థల లీజుకు జాయింట్ వెంచర్ సంస్థ, ఏపీ టవర్స్ లిమిటెడ్, సంబంధిత స్థానిక సంస్థ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటాయి. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోని ప్రభుత్వ స్థలాల్లో టవర్ల ఏర్పాటుకు అనుమతి ఛార్జి, వార్షిక ఛార్జి, నెల అద్దెలను ఖరారు చేశారు.
ఇదీ చదవండి: