రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ చికిత్స అందించేందుకు వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వైద్య నిపుణులకు రూ.1.5 లక్షలు, డ్యూటీ డాక్టర్లకు రూ.70 వేలు చెల్లించాలని ఆదేశించింది. వీరిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరు 6 నెలల పాటు సేవలందించేలా ఒప్పందం చేసుకోవాలని సూచించింది.
ఇదీ చూడండి..