రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుకు ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్‌గా నామకరణం చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఏడుగురు సభ్యులతో ప్రత్యేక వాహక సంస్థ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేక వాహక సంస్థను పబ్లిక్ లిమిటెడ్ అన్ లిస్టెడ్ కంపెనీగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. బోర్డు సీఎండీగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించింది.
రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగు నీరు, గృహ వినియోగానికి,.. పరిశ్రమలకు నీటిని అందించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ.5 కోట్ల మూలధన నిధిని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
ఇదీ చూడండి..