రాష్ట్రంలోని మూడు సామాజిక వర్గాలకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెడ్డి, కమ్మ, క్షత్రియ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కార్పొరేషన్లు నెలకొల్పేందుకు.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము ఉత్తర్వులు ఇచ్చారు.
ఆయా వర్గాల్లోని పలువురు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని.. వారి జీవన ప్రమాణాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదాయార్జన ఆశించిన రీతిలో లేకపోవడం సహా ఉపాధి కరవై కష్టాలు పడుతున్నట్లు తెలిపింది. ఈ తరహా అల్పాదాయ వర్గాల పేదలకు అండగా నిలబడేందుకు.. కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన ఆయా వర్గాల ప్రజలకు వీటి ద్వారా సాయం చేయనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: