రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 2019 - 20 సంవత్సరానికి ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 282 కళాశాలలకు రూ.35 వేల నుంచి రూ.70 వేల వరకూ నిర్ణయించింది. విజయనగరంలోని ప్రావీణ్య మెరైన్ ఇంజినీరింగ్ కళాశాలకు రూ.1.25 లక్షలుగా పేర్కొంది. ఈ మేరకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన బోధన రుసుములకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణంగా మూడేళ్ల కాలానికి నిర్ణయించే బోధన రుసుమును ప్రస్తుత విద్యా సంవత్సరానికే అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఫీజుల నిర్ణయం ఇలా
- రాష్ట్రంలో 180 కళాశాలలకు రూ.35 వేలు రుసుముగా నిర్ణయించగా.. 6 కళాశాలలకు అత్యధికంగా రూ.70 వేలుగా నిర్ణయించారు.
- చిత్తూరు జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్, విజయవాడలోని పీవీపీ సిద్దార్థ, నెల్లూరులోని ఎన్బీకేఆర్ కళాశాల, భీమవరంలోని శ్రీవిష్ణు, ఎస్ఆర్కేఆర్, కర్నూలులోని పుల్లారెడ్డి కళాశాలలకు అత్యధికంగా రూ.70 వేలుగా నిర్ణయించారు.
- కళాశాల యాజమాన్యం ప్రవేశ సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేలే వసూలు చేయాలి. ఇందులో రూ.500 విశ్వవిద్యాలయానికి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.1500 సమావేశాలు, ఇతర పరిపాలనా వ్యయానికి వినియోగించుకోవచ్చు.
- విశ్వవిద్యాలయం అందించే సేవలకుగానూ ఒక్కో విద్యార్థి ఏడాదికి రూ.1,850 చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: