ETV Bharat / city

విద్యార్థుల ప్రతిభ ఆధారంగా.. ఉపాధ్యాయులకు రేటింగ్​ - గురుకుల విద్యపై ఏపీ రాష్ట్ర నూనత ఉత్తర్వులు

సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలల స్థితిగతులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇక నుంచి విద్యార్థులు సాధించే ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయులకు రేటింగ్​ ఇవ్వనున్నారు. ఈ ప్రకారం ఉపాధ్యాయులు కొనసాగడమా.. లేక పదవీ విరమణ చేసి వెళ్లిపోవడమా అనేది తేలనుంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి కల్నల్​ రాములు ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థుల ప్రతిభ ఆధారంగా.. ఉపాధ్యాయులకు రేటింగ్​

author img

By

Published : Dec 3, 2019, 10:05 AM IST

సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీలో విద్యార్థుల ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుల భవితవ్యం తేలనుంది. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థులు చూపే ప్రతిభను బేరీజు వేసుకుని ఉపాధ్యాయులను ఒక శాతం, 5 శాతం లోపు ఫలితాలు అంటూ రెండు విభాగాలుగా విభజిస్తారు. వీరి పని తీరు పరిశీలనకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ఉపాధ్యాయల పనితీరును పరిశీలించి రేటింగ్​ ఇస్తాయి. ఈ రేటింగ్​ ఆధారంగా వారు కొనసాగడమా.. లేక పదవీ విరమణ చేసి వెళ్లిపోవడమా అనేది తేల్చనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి కల్నల్​ రాములు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు.

5 శాతం లోపు ఫలితాలు వస్తే

5 శాతం లోపు ఫలితం వచ్చిన ఉపాధ్యాయులు.. జిల్లా సమన్వయాధికారి(డీసీవో), ఆయా అంశాల్లో నిపుణుడు, స్థానిక డైట్​ కళాశాల నుంచి ఒకరు సభ్యులుగా ఉండే కమిటీ ముందు సెమినార్​ ఇవ్వాలి. దీని ఆధారంగా కమిటీ వారికి రేటింగ్​ ఇస్తుంది. సాధారణం.. అంత కన్నా తక్కువ రేటింగ్​ పొందిన ఉపాధ్యాయులకు ఆరు నెలలు గడువిస్తారు. తర్వాత వారు సొసైటీ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ముందు సెమినార్​ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కమిటీ ముందు సైతం ఇవే ఫలితాలు పునరావృతమైతే వారు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

1 శాతం లోపు ఫలితాలు వస్తే

1 శాతం లోపు ఫలితాలు సాధించిన ఉపాధ్యాయుల సొసైటీ కార్యదర్శి, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి సంచాలకులు(ఎన్​సీఈఆర్​టీ) లేదా డైట్​ కళాశాల ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు విషయ నిపుణులతో ఏర్పాటు చేసే కమిటీ ముందు సెమినార్​ ఇవ్వాల్సి ఉంటుంది. తక్కువ రేటింగ్​ వచ్చిన ఉపాధ్యాయులకు సామర్థ్యం పెంపు కోసం ఏడాది సమయం ఇస్తారు. ఆ తర్వాత కూడా సాధారణం అంత కన్నా తక్కువ రేటింగ్​ వస్తే వారు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:

'పోలవరం పూర్తికి రాష్ట్ర పనితీరే కీలకం'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.