ETV Bharat / city

మూడు రాజధానులకు.. ఈ నెల 16న శంకుస్థాపన..?

మూడు రాజధానుల శంకుస్థాపన దిశగా రాష్ట్ర ప్రభుత్వం.. వడివడిగా అడుగులేస్తోంది. ఈ నెల 16న ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం.

మూడు రాజధానులకు.. ఈ నెల 16న శంకుస్థాపన..?
మూడు రాజధానులకు.. ఈ నెల 16న శంకుస్థాపన..?
author img

By

Published : Aug 9, 2020, 3:12 AM IST

Updated : Aug 9, 2020, 3:54 AM IST

మూడు రాజధానులకు ఈనెల 16న శంకుస్థాపన..?

పాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో తదుపరి కార్యచరణపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచుతోంది. మూడు రాజధానుల శంకుస్థాపనకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 16న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయన అపాయింట్‌మెంట్‌ కోరారు. మూడు రాజధానుల శంకుస్థాపనతో పాటు..పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించాలని భావిస్తున్నారు.

ఈ విషయమై ప్రధాని కార్యాలయ సంయుక్త అధికారి వి.శేషాద్రికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఆ లేఖ ప్రతిని ప్రధాని కార్యాలయ ఓఎస్డీ సంజయ్‌కు కూడా పంపారు.

ముహూర్తాలు లేనందునే..!

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృతాభివృద్ధి చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉంటాయి. ఈ మూడు రాజధానుల శంకుస్థాపన చేసేందుకు ఈనెల 16వ తేదీని ముహూర్తంగా నిర్ణయించామని ప్రధాని కార్యాలయ సంయుక్త అధికారి రాసిన లేఖలో ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు. ఈ తేదీ తర్వాత మళ్లీ 2 నెలల పాటు ముహూర్తాలు లేవని..అందువల్ల వీలైనంత త్వరగా ప్రధాని నరేంద్రమోదీతో అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తే ముఖ్యమంత్రి జగన్‌ ఆయనను స్వయంగా కలిసి 2 ప్రాజెక్టుల గురించి వివరించి ఆహ్వానిస్తారని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి..

రాష్ట్రంపై కరోనా పడగ... మళ్లీ పది వేలకు పైగా కేసులు

Last Updated : Aug 9, 2020, 3:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.