పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి సంబంధించి నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కేటాయించిన ఖాళీ ఇళ్ల స్థలాల విక్రయంపై నిషేధం విధిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం కేటాయించిన ఉచిత ఇంటి స్థలంలో లబ్ధిదారులు కనీసం ఐదేళ్ల పాటు హక్కు కలిగి ఉండాల్సిందేనని జీవోలో పేర్కొంది. ప్రతి లబ్ధిదారు ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ఈ మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితి తర్వాత మాత్రమే బదలాయింపు, విక్రయానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. పునః పరిశీలన అనంతరం ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం సూచించింది.
ఇదీ చదవండి: అసలు ఏమిటీ తబ్లీగీ జమాత్? వీటి లక్ష్యాలేంటి?