పదోతరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బెటర్‌మెంట్ పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 49, అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి బెటర్‌మెంట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. 2 సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. సబ్జెక్టుకు రూ.500 ఫీజుతో బెటర్‌మెంట్ రాసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ ఏడాది పరీక్షలకు మాత్రమే బెటర్‌మెంట్ వెసులుబాటు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 19లోగా బెటర్‌మెంట్ పరీక్షల ఫీజు చెల్లించాలని సూచించింది.
ఇవీ చదవండి: