ETV Bharat / city

సీనియర్లకంటే ఎక్కువ వేతనం పొందుతున్న జూనియర్స్! - ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఎన్నో ఏళ్లుగా ఒప్పంద ప్రతిపదికన పనిచేస్తున్న సీనియర్ స్టాఫ్ నర్సుల కంటే.. కొద్ది రోజుల క్రితం విధుల్లో చేరిన జూనియర్ స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఎక్కువ జీతం అందిస్తోంది. అవును మీరు విన్నది నిజమే.. కొద్దికాలం కిందట చేపట్టిన నియామకాల్లో స్టాఫ్‌ నర్సులుగా బోధనాసుపత్రులు, ఇతరచోట్ల చేరిన కొందరికి రూ.34 వేలను వేతనం కింద వైద్య ఆరోగ్య శాఖ చెల్లిస్తోంది. సీనియర్‌ స్టాఫ్‌ నర్సుల నెల వేతనం రూ.22,500 మాత్రమే అందుతోంది. ఈ కారణంతో.. కొందరు నర్సులు సీనియార్టీని వదులుకొని కొత్తగా విధుల్లో చేరారు.

junior staff nurses
జునియర్ స్టాఫ్ నర్సుల వేతనాలు
author img

By

Published : Jun 21, 2021, 7:40 AM IST

Updated : Jun 21, 2021, 11:53 AM IST

సీనియర్‌ స్టాఫ్‌ నర్సుల నెల వేతనం రూ.22,500. జూనియర్‌ స్టాఫ్‌ నర్సుల వేతనం రూ.34,000. వైద్య, ఆరోగ్యశాఖ ఆసుపత్రుల్లో పని చేసే స్టాఫ్‌ నర్సులకు చెల్లించే జీతాల్లో కనిపిస్తున్న తేడా ఇది. విధులు, పని వేళలు ఒకటే. కానీ సీనియారిటీకి తగ్గ వేతనం, ఉద్యోగ భద్రత కనిపించడం లేదని స్టాఫ్‌ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒప్పంద విధానంలో 11,820 మంది స్టాఫ్‌ నర్సులు విధుల్లో చేరగా వీరిలో 7,867 మందికి నెలకు వేతనం కింద రూ.22,500 చెల్లిస్తున్నారు. 3,953 మందికి రూ.34 వేలు చెల్లిస్తున్నారు. శాశ్వత స్టాఫ్‌ నర్సులకు ‘గ్రాస్‌ పే’ కింద రూ.34వేలను కొత్తగా చేరే వారికి ఇస్తున్నారు. తాత్కాలిక పద్దతిలో కొవిడ్‌ విధుల్లో చేరిన వారికీ నెలకు రూ.34,000 చెల్లిస్తున్నారు.

నిత్యం కొనసాగుతున్న నియామకాలు..

ఇంటర్‌ విద్యార్హతతో మూడున్నర సంవత్సరాల డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారిని స్టాఫ్‌ నర్సులుగా వైద్య ఆరోగ్య శాఖ 2006 నుంచి అడపాదడపా నియమిస్తూనే ఉంది. 2006 ప్రాంతంలో చేరిన స్టాఫ్‌ నర్సులకు తొలుత నెలకు రూ.5,000, రూ.7,000, 2011లో చేరిన వారికి రూ.12,000 వేతనం కింద అందజేశారు. వేతనాలు కాస్త పెరిగి ప్రస్తుతం వీరు నెలకు రూ.22,500 అందుకుంటున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో వీరు పనిచేస్తున్నారు. కొద్దికాలం కిందట చేపట్టిన నియామకాల్లో స్టాఫ్‌ నర్సులుగా బోధనాసుపత్రులు, ఇతరచోట్ల చేరిన కొందరికి రూ.34వేలను వేతనం కింద వైద్య ఆరోగ్య శాఖ చెల్లిస్తోంది. దీంతో తక్కువ వేతనం అందుకుంటోన్న స్టాఫ్‌ నర్సుల్లో పలువురు సీనియార్టీని వదులుకొని కొత్తగా విధుల్లో చేరారు.

‘గత కొన్నేళ్ల నుంచి ఒప్పంద విధానంలో పని చేస్తున్న స్టాఫ్‌ నర్సుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. ఎన్నికల హామీలో క్రమబద్ధీకరణ గురించి పేర్కొన్నా పురోగతి లేదు. కొవిడ్‌ విధుల్లో పాల్గొంటూ స్టాఫ్‌ నర్సుల్లో పలువురు ప్రాణాలు విడిచినా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం లభించడంలేదు’’అని రాష్ట్ర ప్రభుత్వ ఒప్పంద, పొరుగుసేవల స్టాఫ్‌ నర్సుల యూనియన్‌ అధ్యక్షురాలు దయామణి పేర్కొన్నారు.

‘బోధనాసుపత్రుల్లో ఒప్పంద నియామకాల కోసం 2016లో ఇచ్చిన ప్రకటన ప్రకారం నియమించిన వారిలో ప్రస్తుతం 872 మంది పని చేస్తున్నారు. వీరికి నెలకు వేతనం రూ.22,500 చెల్లిస్తున్నాం. కొత్తగా నియమించిన వారికి రూ.34,000 ఇస్తున్నాం. న్యాయం చేయాలని సీనియర్‌ స్టాఫ్‌ నర్సులు ఇచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వ్యత్యాసాలను తొలగించాలని సిఫారసు చేశాం’ _ వైద్య విద్య సంచాలకులు డా. రాఘవేంద్రరావు

‘రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులకు ప్రభుత్వం ద్వారానే వేతనాలు చెల్లిస్తారు. కేంద్ర పథకాల్లో భాగంగా మంజూరైన పోస్టులు భర్తీ చేసినప్పుడు వారికిచ్చే వేతనాలు వేరుగా ఉంటున్నాయి. దీనివల్లే వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయని మరో అధికారి వెల్లడించారు.

ఇదీ చదవండి:

Vaccination record: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సరికొత్త రికార్డు

Office timings: ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు

Last Updated : Jun 21, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.