జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 57 లక్షల 52 వేల 445 ఇళ్లకు మంచినీటి కుళాయిల ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్ర వాటాగా కేటాయించాల్సిన నిధులకు సంబంధించి పాలనా అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటింటికీ కుళాయి పథకానికి సంబంధించి 4800.59 కోట్ల రూపాయల మేర నిధుల వినియోగానికి పాలనా అనుమతులు ఇస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను కూడా వినియోగిచుకుంటూ.. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్టుకు 10 వేల 975 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని.. ఇందులో రాష్ట్ర వాటాగా 4800.59 కోట్లకు పాలనా అనుమతులు ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండీ... మంత్రి జయరాం భూదందాకు పాల్పడ్డారు: అయ్యన్నపాత్రుడు